చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత దేవేందర్ రెడ్డి కారుపై దాడి

ABN , First Publish Date - 2020-10-07T17:47:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షనేతల వాహనాలపై దాడుల పర్వం కొనసాగుతోంది.

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత దేవేందర్ రెడ్డి కారుపై దాడి

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో విపక్షనేతల వాహనాలపై దాడుల పర్వం కొనసాగుతోంది. మొన్న విజయవాడలో టీడీపీ నేత పట్టాభిరాం కారుపై దాడి జరిగిన ఉదంతం మరువకముందే.. చిత్తూరు జిల్లాలో మరొక దాడి జరిగింది. రేణిగుంట మండలం, కొత్తరమంగళం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.


దేవేందర్ రెడ్డి ఇంటివద్ద పార్కింగ్‌లో ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇది వైసీపీ నేతల పనేనని దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ దాడిని తిరుపతి టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ తీవ్రంగా ఖండించారు. దుండగులు వాడిన ఆయుధాలు కూడా వదిలేసి పారిపోయారని దేవేందర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.

Read more