తాడేపల్లి ప్యాలెస్‌లోనా.. లోటస్‌పాండ్‌లోనా!?

ABN , First Publish Date - 2020-05-11T10:32:54+05:30 IST

‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే, మద్య నియంత్రణకు విప్లవాత్మక మార్పులు తెచ్చామంటూ ప్రభుత్వం ప్రకటనలివ్వడం సిగ్గుచేటు.

తాడేపల్లి ప్యాలెస్‌లోనా.. లోటస్‌పాండ్‌లోనా!?

మద్యనిషేధం దిశగా అడుగులెటు? : టీడీపీ


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే, మద్య నియంత్రణకు విప్లవాత్మక మార్పులు తెచ్చామంటూ ప్రభుత్వం ప్రకటనలివ్వడం సిగ్గుచేటు. మార్పు అంటే.. ధరలు పెంచి, పేదల రక్తం తాగటమా? ఇదేనా విప్లవాత్మక మార్పు? మద్యపాన నిషేధం దిశగా జగన్‌ అడుగులు ఎక్కడ వేస్తున్నారు? తాడేపల్లి ప్యాలె్‌సలోనా? లోట్‌సపాండ్‌లోనా?’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులే బూతులు మాట్లాడడం సిగ్గుచేటని టీడీపీ నేతలు జవహర్‌, నిమ్మల రామానాయుడు, యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. 

Updated Date - 2020-05-11T10:32:54+05:30 IST