శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-12-30T02:16:21+05:30 IST

శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు

శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరం: అచ్చెన్నాయుడు

అమరావతి: శ్రీశైలంలో భక్తుడు బోడ్డు శ్రీను మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘భక్తుడి మృతికి ఈవో, ఛైర్మన్‌లే బాధ్యత వహించాలి. భక్తులకు సకాలంలో దైవదర్శనం కల్పించాలని అడిగిన అర్చకుడిపై వైసీపీ నేతలు దాడి. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. 19 నెలల వైసీపీ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా 110 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భక్తుడు మృతి వెనుక దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.


Updated Date - 2020-12-30T02:16:21+05:30 IST