బీసీలకే అగ్రతాంబూలం

ABN , First Publish Date - 2020-11-07T09:16:59+05:30 IST

బీసీలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని వ్యవస్థీకరించారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన

బీసీలకే అగ్రతాంబూలం

219 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ

50 ఉపకులాలకు చోటు

61% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే

సీనియర్లు, యువతకు అవకాశం 


అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీసీలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని వ్యవస్థీకరించారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని నియమించగా.. రాష్ట్ర కమిటీ కూర్పులోను అదే ఒరవడి కనిపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 61 శాతం పదవులిస్తూ.. రాష్ట్ర కమిటీ ఎంపికను పూర్తిచేశారు. 219 మందితో కూడిన కమిటీని శుక్రవారం ప్రకటించారు. బీసీలకు 41 శాతం, ఎస్సీ 11 శాతం, ఎస్టీ మూడు శాతం, మైనారిటీలకు ఆరు శాతం.. మొత్తంగా 61 శాతం పదవులు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చారు. సీనియర్లకు, యువతకు పెద్దపీట వేస్తూ.. గత 17 నెలల కాలంలో బలంగా గళం వినిపించినవారికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు పార్టీలో ఎలాంటి పదవులు లేని కొత్తవారికి ఇదే కేటగిరీ కింద అవకాశమిచ్చారు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు, అదేవిధంగా అన్ని ఉపకులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. 50 బీసీ ఉపకులాలకు కమిటీలో చోటు దక్కింది. మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించామని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. యువ నాయకత్వానికి పార్టీని అందించడమే లక్ష్యంగా ఎంపిక జరిగిందని చెబుతున్నాయి. 18 మంది ఉపాఽధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి.. వెరసి 219 మందిని నియమించారు. కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు.

 

ఉపాధ్యక్షులు..

నిమ్మల కిష్టప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం, దాట్ల సుబ్బరాజు, పిడతల సాయికల్పనారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్‌, సుజయ్‌ కృష్ణ రంగారావు, బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, జి.తిప్పేస్వామి, వి.హనుమంతరాయచౌదరి, పుత్తా నర్సింహారెడ్డి, దామచర్ల జనార్దన్‌రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద్‌సూర్య.


ప్రధాన కార్యదర్శులు..

పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, దేవినేని ఉమ, అమరనాథ్‌రెడ్డి, బాలవీరాంజనేయస్వామి, బీటీ నాయుడు, భూమా అఖిలప్రియ, ఎం.డి.నజీర్‌, పంచుమర్తి అనురాధ, బి.చెంగల్రాయుడు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్దా వెంకన్న, చింతకాయల అయ్యన్న, మద్దిపాటి వెంకటరాజు.


అధికార ప్రతినిధులు..

గౌనివారి శ్రీనివాసులు, ద్వారపురెడ్డి జగదీశ్‌, మర్రెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరి ఎరిక్సన్‌బాబు, పరిటాల శ్రీరామ్‌, కాకి గోవిందరెడ్డి, నాగుల్‌ మీరా, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, ఆనం వెంకటరమణారెడ్డి, గంజి చిరంజీవులు, రుద్రరాజు పద్మరాజు, పిల్లి మాణిక్యాలరావు, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌, డాక్టర్‌ సప్తగిరి ప్రసాద్‌, మోకా ఆనంద్‌సాగర్‌, దివ్యవాణి, డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సయ్యద్‌ రఫీ.


కార్యనిర్వాహక కార్యదర్శులు..

బొబ్బిలి చిరంజీవులు, చిన్నం బాబూ రమేశ్‌, ఎల్‌.ఎల్‌.నాయుడు, కోళ్ల అప్పలనాయుడు, తెంటు లక్ష్మినాయుడు, మహంతి చిన్నంనాయుడు, కరణం శివరామకృష్ణ, కోళ్ల బాలాజీ అప్పలరామ్‌ప్రసాద్‌, కొఠారు దొరబాబు, కోరాడ రాజాబాబు, పీలా శ్రీనివాసరావు, వనమాడి కొండబాబు, వి.ఎల్‌.సూర్యనారాయణరాజు, నామన రాంబాబు, డొక్కా జగన్నాథం, మెట్ల వెంకటరాంబాబు, ముళ్లపూడి బాపిరాజు, ఆదిరెడ్డి వాసు, ఎర్రా వేణుగోపాలరాయుడు, పాలిక శ్రీను, అంగర రామ్మోహన్‌రావు, మంతెన సత్యనారాయణరాజు, పీతల సుజాత, గొర్రెల శ్రీధర్‌, చింతమనేని ప్రభాకర్‌, కాగిత కృష్ణప్రసాద్‌, రాజేష్‌ కిలారు, నల్లగట్ల స్వామిదాసు, దాసరి రాజా మాస్టారు, చిట్టాబత్తిన చిట్టిబాబు, బుచ్చిరాంప్రసాద్‌, మొహమ్మద్‌ హిదాయత్‌, రాయపాటి రంగారావు, మానుకొండ శివప్రసాద్‌, వెన్నా సాంబశివారెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, వేల్పుల సింహాద్రి యాదవ్‌, నాదెండ్ల బ్రహ్మం చౌదరి,  జయప్రకాష్‌ నారాయణ, నారపుశెట్టి పాపారావు, పెళ్లకూరు శ్రీనివాసులురె డ్డి, దివి శివరాం, జి.మురళీకన్నబాబు, ఇనుకొండ సుబ్రమణ్యం, పీఆర్‌ మోహన్‌, సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి, బి.నరేశ్‌కుమార్‌రెడ్డి, బచ్చల పుల్లయ్య, చెన్నూరు సుధాకర్‌, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఎస్‌.గోవర్ధన్‌న్‌రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్‌. ఎస్‌.సవిత, ఇ.రాజ్యవర్ధన్‌న్‌రెడ్డి, కరణం రామ్మోహన్‌.


కోశాధికారి..: మెంటే పద్మనాభం

నాలెడ్జ్‌ కమిటీ చైర్మన్‌: గురజాల మాల్యాద్రి

ప్రోగ్రామ్స్‌ కమిటీ ఇన్‌చార్జి: మద్దిపాటి వెంకటరాజు

కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి


బీసీలదే టీడీపీ మరోసారి రుజువైంది: యనమల

‘‘టీడీపీ బీసీలదేనని మళ్లీ రుజువైంది. రాష్ట్ర కమిటీలో 61 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇవ్వడం హర్షణీయం. నూతన జట్టు వైసీపీ అక్రమాలు, కుంభకోణాలు, దాడులు-దౌర్జన్యాలనుఎండగట్టాలి’’ అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీపై అపోహలు సృష్టించి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలపై దాడులు, బీసీలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులతో అన్ని వర్గాలకూ ఆపార్టీ దూరమైందని అన్నారు.

Updated Date - 2020-11-07T09:16:59+05:30 IST