-
-
Home » Andhra Pradesh » TDP senior leader Varla Ramaiah
-
దళితుడనే ఉయ్యూరు కమిషనర్‌ను సస్పెండ్ చేశారు: వర్ల
ABN , First Publish Date - 2020-12-29T01:02:55+05:30 IST
బ్యాంకుల ముందు చెత్తవేయడాన్ని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

అమరావతి: బ్యాంకుల ముందు చెత్తవేయడాన్ని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బ్యాంకుల ముందు చెత్తవేసి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం క్షమించరానిది. కేంద్రం కన్నెర్రతో తోకముడిచిన రాష్ట్ర ప్రభుత్వం. దళితుడని ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి మిగతావారిని ఎందుకు చేయలేదు? కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన దళిత వర్గానికి చెందిన కమిషనర్ ప్రకాశ్ రావును సస్పెండ్ చేసింది. వరుసగా దళితులపై ఎన్నో దాడులు చేస్తున్నా కిమ్మనలేదు. ఇప్పుడు ఉయ్యూరు కమిషనర్‌ను సస్పెండ్ చేయడం కూడా దళిత వర్గాలపై దాడితో సమానమే. వెంటనే దళిత కమిషనర్ ప్రకాశ్‌రావు సస్పెన్షన్‌ను తొలగించవల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యవహారశైలి కక్షపూరితంగా “పగసాధిస్తా” అన్నట్లుగా ఉన్నది. దళితులపై ప్రభుత్వ దాడికి ఉద్యోగస్తులు కూడా మినహాయింపు కాదు’ అని తెలుస్తుందన్నారు.