టీడీపీ పగ్గాలు అచ్చెన్నకు

ABN , First Publish Date - 2020-09-29T08:17:56+05:30 IST

టీడీపీ రాష్ట్ర కమిటీ కసరత్తు కొలిక్కి వస్తోంది. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరు ఖరారైంది.

టీడీపీ పగ్గాలు అచ్చెన్నకు

ప్రధాన కార్యదర్శిగా బీద రవిచంద్ర

అక్టోబరు తొలివారంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు

 పొలిట్‌ బ్యూరోలోకి కళా వెంకట్రావు

 

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కమిటీ కసరత్తు కొలిక్కి వస్తోంది. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరు ఖరారైంది. ఇదే పదవికి ఒక దశలో ప్రచారంలోకి వచ్చిన బీద రవిచంద్ర యాదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఆయనకు వివిధ అనుబంధ సంఘాల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారని సమాచారం.


మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రస్తు తం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా అచ్చెన్నాయుడుకే సీనియర్లు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. 


Updated Date - 2020-09-29T08:17:56+05:30 IST