టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2020-04-09T20:37:29+05:30 IST
టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కరోనా వైరస్
అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో కరోనా వైరస్, బాధితుల ఆందోళన, వైద్యుల ఇక్కట్లపై చర్చించే అవకాశం ఉంది. పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడాన్ని సమావేశంలో సభ్యులు లేవనెత్తారు. ఈ సమావేశానికి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్, చినరాజప్ప, కళా వెంకట్రావు, వర్లరామయ్య, గల్లా జయదేవ్, గల్లా అరుణ, లోకేష్ హాజరైనారు.