-
-
Home » Andhra Pradesh » TDP Panchumarti Anuradha Press Meet
-
అమ్మలాంటి అమరావతిని చంపేశారు: అనురాధ
ABN , First Publish Date - 2020-12-15T21:26:14+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతికి జగన్‌రెడ్డి మరణశాసనం

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతికి జగన్‌రెడ్డి మరణశాసనం రాశారని ధ్వజమెత్తారు. రాజధాని మహిళలను ప్రభుత్వం వేధించడం మొదలుపెట్టి ఏడాది కావొస్తోందని తెలిపారు. 3 రాజధానుల నిర్ణయంతో మహిళలకు చీకటి రోజులొచ్చాయన్నారు. జగన్ ఇంట్లో లక్షల కొద్దీ సూటుకేసులు, ప్రజలపైన లక్షల కేసులా? అంటూ అనురాధ నిలదీశారు.