-
-
Home » Andhra Pradesh » TDP office case Postponement of trial
-
‘టీడీపీ ఆఫీస్’ కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-11-25T10:00:11+05:30 IST
పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం టీడీపీకి స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రెండువారాల

అఫిడవిట్‌కు గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం టీడీపీకి స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రెండువారాల పాటు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో పార్టీ కార్యాలయానికి భూమిని కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రామకృష్ణారెడ్డి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం గత ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో ఆళ్ల దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, కేసులో ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుకు మరికొంత గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.