ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రులకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-24T22:17:00+05:30 IST

కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులను టీడీపీ ఎంపీలు కలిశారు. ప్రధాన

ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రులకు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

ఢిల్లీ: కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులను టీడీపీ ఎంపీలు కలిశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాల అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.


అంతకముందు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్, కేశినేని, కనకమేడల పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T22:17:00+05:30 IST