కౌలు రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పండి

ABN , First Publish Date - 2020-12-01T08:59:17+05:30 IST

కౌలు రైతులకు తుఫాన్‌ నష్టపరిహారం ఎట్లా ఇస్తారో చెప్పాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కౌలు రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పండి

రెండో విపత్తు పరిహారం ఏమైంది:  టీడీపీ ఎంపీ జయదేవ్‌


తెనాలి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కౌలు రైతులకు తుఫాన్‌ నష్టపరిహారం ఎట్లా ఇస్తారో చెప్పాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తుఫానుకు దెబ్బతిన్న చేలను సోమవారం ఆయన పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తనకు కౌలు అర్హత కార్డు ఇవ్వకపోవటం వల్ల అన్నివిధాలా నష్టపోయానని, గతంలో జరిగిన నష్టానికీ పరిహారం అందలేదని, ఈసారి కూడా పరిహారం అందుతుందో లేదో అర్ధంకావటంలేదంటూ ఓ కౌలు రైతు ఎంపీ వద్ద వాపోయాడు. జయదేవ్‌ స్పందిస్తూ.. కౌలు రైతులకు ఎంతిస్తారు? అసలు ఇస్తారో.. లేదో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రైతులను కూడా రాజకీయపరంగా విభజిస్తోందని, ఇంతటి నీచమైన రాజకీయాలకు దిగటం సిగ్గుచేటని విమర్శించారు. 

Updated Date - 2020-12-01T08:59:17+05:30 IST