‘రాజధాని’ని కేంద్ర జాబితాలో చేర్చండి

ABN , First Publish Date - 2020-09-20T09:18:31+05:30 IST

రాష్ట్రాల రాజధాని నిర్ణయ అంశాన్ని రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో చేర్చాలని, అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని

‘రాజధాని’ని కేంద్ర జాబితాలో చేర్చండి

 నిధులిచ్చి సంబంధం లేదంటే ఎలా?: గల్లా జయదేవ్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల రాజధాని నిర్ణయ అంశాన్ని రాజ్యాంగంలోని కేంద్ర జాబితాలో చేర్చాలని, అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రతిపాదించారు. శనివారం లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. రాజధానిపై హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని, అలాంటప్పుడు బాధ్యత లే దంటే ఎలా? అని ప్రశ్నించారు. 248(1) అధికరణను ఉపయోగించి రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలన్నారు.


డాక్టర్లపై ఏపీ సర్కారు కక్షపూరిత చర్యలు: కనకమేడల

ఏపీలో కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉన్న డాక్టర్లపై ప్రభుత్వమే కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం ఆయన రాజ్యసభలో అంటువ్యాధుల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. ఏపీలో వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వడంలేదని అన్నందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ను అక్రమంగా అరె్‌స్టచేశారని తెలిపారు. విజయవాడలో డాక్టర్‌ రమేశ్‌ను కూడా ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని వివరించారు. 

Updated Date - 2020-09-20T09:18:31+05:30 IST