కేంద్రాన్ని నిధులు అడిగే దమ్ము వైసీపీకి లేదు: టీడీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-05-30T14:24:35+05:30 IST

కేంద్రాన్ని నిధులు అడిగే దమ్ము వైసీపీకి లేదు: టీడీపీ ఎమ్మెల్సీ

కేంద్రాన్ని నిధులు అడిగే దమ్ము వైసీపీకి లేదు: టీడీపీ ఎమ్మెల్సీ

అమరావతి: ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల్లో వైసీపీ వాడుకుందని టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీని విభజించడం వల్ల కాంగ్రెస్‌కు జరిగిన నష్టమే...ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం వల్ల బీజేపీకి జరిగిందన్నారు. కేంద్రాన్ని గట్టిగా నిధులు అడిగే దమ్ము వైసీపీకి లేదని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోవడంతో కేంద్రం దగ్గరకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. ఏపీ ప్రజలకు ప్రత్యేకహోదా అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌ కాదని...కేంద్రంలో బీజేపీ ఉన్నంత కాలమే ప్రత్యేకహోదా అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌ అని రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-05-30T14:24:35+05:30 IST