‘ప్రత్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదా?’

ABN , First Publish Date - 2020-03-12T17:46:02+05:30 IST

ప్రత్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదా? అని అధికార పార్టీపై

‘ప్రత్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదా?’

అమరావతి : ప్రత్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదా? అని అధికార పార్టీపై టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘటనలపై ఇవాళ టీడీపీ నేతలు మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రులు ఇంటికేనని ముఖ్యమంత్రే హెచ్చరించడమేంటి? అని తీవ్రంగా మండిపడ్డారు.


మాచర్ల ఘటనే నిదర్శనం

వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలుగా మారారు. ఏపీలో రాచరిక పాలన నడుస్తోంది. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు మాచర్ల ఘటనే నిదర్శనం. 11 మంది ఎంపీటీసీలు లోనికి వెళ్లకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. మాచర్ల ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవం అని వైసీపీ ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? అనే అనుమానం కలుగుతోంది. పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ ఇంట్లో పోలీసు అధికారులకు విందు ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయం టీడీపీదేఅని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-12T17:46:02+05:30 IST