విశాఖ ప్రజలకు రక్షణ కరువైంది : ఎమ్మెల్సీ దువ్వారపు

ABN , First Publish Date - 2020-07-14T16:58:16+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం

విశాఖ ప్రజలకు రక్షణ కరువైంది : ఎమ్మెల్సీ దువ్వారపు

విశాఖపట్నం : జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల ప్రాంతంలో సాల్వెంట్ ప్లాంట్‌లో జరిగిన ఈ భారీ పేలుడుతో వైజాగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు స్పందించారు. విశాఖ పరిశ్రమల్లో జరుగుతున్న వరుస సంఘటనలు విశాఖ వాసులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. విశాఖ ప్రజలకు రక్షణ కరువైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రభుత్వము, ప్రభుత్వ విభాగాలు నైతిక బాధ్యత వహించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దువ్వారపు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-14T16:58:16+05:30 IST