మనీబిల్ అడగలేదని నిరూపించండి...రాజీనామాకు సిద్ధం: టీడీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-06-18T19:21:58+05:30 IST

మనీబిల్ అడగలేదని నిరూపించండి...రాజీనామాకు సిద్ధం: టీడీపీ ఎమ్మెల్సీ

మనీబిల్ అడగలేదని నిరూపించండి...రాజీనామాకు సిద్ధం: టీడీపీ ఎమ్మెల్సీ

విశాఖపట్నం: వైసీపీ నేతలు మనీబిల్ అంశంపై టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వర రావు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మండలిలో మనీ బిల్ ప్రవేశ పెట్టమని టీడీపీ 30 సార్లు కోరిందని..అయినా అధికార పక్షం ముందుకు రాలేదన్నారు. కౌన్సిల్‌లో మనీబిల్ టీడీపీ అడగలేదని నిరూపిస్తే.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరూ దాడికి వెళ్ళలేదని..వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బుద్ధ నాగజగదీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-18T19:21:58+05:30 IST