ఆ కేసులు ఎత్తేయడం వెనుక ఆంతర్యమేంటి? : బుద్దా

ABN , First Publish Date - 2020-03-19T18:07:09+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక పాత్ర ఉందని రిలయన్స్ సంస్థలపై దాడి చేయించిన జగన్

ఆ కేసులు ఎత్తేయడం వెనుక ఆంతర్యమేంటి? : బుద్దా

అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక పాత్ర ఉందని రిలయన్స్ సంస్థలపై దాడి చేయించిన జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు విధ్వంసకారులపై కేసులు ఎత్తివేయడం వెనుక ఆంతర్యమేంటి? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ హత్య వెనుక కుట్రదారుడు జగనే అని సంచలన ఆరోపణ చేశారు. 


రాజధాని కోసం ఆందోళన చేస్తున్నవారిపై అక్రమంగా కేసులు బనాయించారని.. మహిళలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయించారని వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. సీఎం స్థానంలో ఉండి జగన్ కులాల ప్రస్తావన తేవడం సరికాదన్నారు. స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం అనర్హుడని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-03-19T18:07:09+05:30 IST