నిరూపిస్తే హోం మంత్రి రాజీనామా చేస్తారా?: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2020-03-12T19:52:23+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన వైసీపీ అరాచకాలపై హైకోర్టులో పిటిషన్లు వేశామని

నిరూపిస్తే హోం మంత్రి రాజీనామా చేస్తారా?: అశోక్‌బాబు

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన వైసీపీ అరాచకాలపై హైకోర్టులో పిటిషన్లు వేశామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 12 జెడ్పీటీసీలు, 470 ఎంపీటీసీల్లో ఎన్నికలు రీషెడ్యూల్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన సమయంలోనూ పత్రాలు చించేసే దుస్థితి నెలకొందన్నారు. 


నిరూపిస్తే రాజీనామా చేస్తారా..!?

పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లారని హోంమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వబట్టే అది వైసీపీకి చేరింది. పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు నిరూపిస్తే హోంమంత్రి రాజీనామా చేస్తారా?. పోలీసులు యూనిఫాం తీసేసి వైసీపీ దుస్తులు ధరిస్తే మంచిదిఅని అశోక్‌బాబు చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-03-12T19:52:23+05:30 IST