పోలీసుల అదుపులో టీడీపీ సానుభూతిపరులు.. రాత్రి నుంచి ఎమ్మెల్యే ఆందోళన

ABN , First Publish Date - 2020-03-15T14:37:30+05:30 IST

ఎంవీపీ ఎక్సైజ్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఆయన ఆందోళన..

పోలీసుల అదుపులో టీడీపీ సానుభూతిపరులు.. రాత్రి నుంచి ఎమ్మెల్యే ఆందోళన

విశాఖ: ఎంవీపీ ఎక్సైజ్‌ ఆఫీసు ఎదుట టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఆయన ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు, సానుభూతిపరులపై ఎక్సైజ్‌ అధికారులు అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బార్‌లో పని చేస్తున్న టీడీపీ సానుభూతిపరులను అకారణంగా ఎక్సైజ్ పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి ఎక్సైజ్ పోలీస్ అధికారులను నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని వెలగపూడి ఆరోపించారు. 


Updated Date - 2020-03-15T14:37:30+05:30 IST