వైసీపీ గూటికి కరణం.. నేడో రేపో జగన్‌తో భేటీ

ABN , First Publish Date - 2020-03-12T10:17:50+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పార్టీని వీడడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ఆయన సీఎం

వైసీపీ గూటికి కరణం.. నేడో రేపో జగన్‌తో భేటీ

ఒంగోలు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పార్టీని వీడడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ఆయన సీఎం జగన్‌ను కలవనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చల అనంతరం ఆయన వైసీపీలో చేరిక ఖరారైనట్లు తెలిసింది. జిల్లాలో అత్యధిక నియోజకవర్గాల్లో ప్రభావం వేయగలిగిన కరణం బలరాంను పార్టీలోకి తీసుకొచ్చుకోవడానికి మంత్రి బాలినేని చక్రం తిప్పారు. మూడు రోజుల క్రితమే ఆయన సీఎంను కలిసి కరణం చేరికపై చర్చించారు. అనంతరం కరణంను కలిసి ఒప్పించారు.

Updated Date - 2020-03-12T10:17:50+05:30 IST