పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి: టీడీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-04-25T15:57:38+05:30 IST

పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి: టీడీపీ ఎమ్మెల్యే

పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి: టీడీపీ ఎమ్మెల్యే

అమరావతి: ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకోవాలంటూ పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుుకు కొండపి ఎమ్మెల్యే, టీడీఎల్పీ విప్ బాల వీరాంజనేయస్వామి లేఖ రాశారు. ప్రకాశం జిల్లాలో 27,262 మంది పొగాకు రైతులు 82.44 మిలియన్ కేజీల పొగాకు పండించి ఇళ్ల వద్దే ఉంచుకున్నారని...లాక్‌డౌన్ కారణంగా సకాలంలో అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈపాటికే పొగాకు బోర్డు ద్వారా కొనుగోళ్లు జరిగిపోయేవి కానీ ఈ సంవత్సరం చాలా ఆలస్యం అయ్యిందని అన్నారు.


కొనుగోలుదారులతో సంప్రదించి రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కరోనాతో పాటు ప్రకృతి ప్రతికూలత, అకాల వర్షాల కారణంగా పొగాకు దిగుబడి తగ్గి రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు.  సాగుకు పెట్టుబడి వ్యయం కూడా విపరీతంగా పెరిగిందని...రైతుల ఇబ్బందులను గుర్తించి పొగాకు బోర్డు నుంచి బ్యారెన్‌కు లక్షరూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు.  బ్యాంకులతో సంప్రదించి పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-25T15:57:38+05:30 IST