దళితులకు పారిశ్రామిక పాలసీని పున:సమీక్షించాలి: టీడీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-11T16:03:05+05:30 IST

సీఎం జగన్ రెడ్డి దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాలవారికి అండగా ఉంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుని...

దళితులకు పారిశ్రామిక పాలసీని పున:సమీక్షించాలి: టీడీపీ ఎమ్మెల్యే

ప్రకాశం: సీఎం జగన్ రెడ్డి దళిత, గిరిజన, వెనుకబడ్డ వర్గాలవారికి  అండగా ఉంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుని... అధికారం చేజిక్కించుకున్నాక వారికే నమ్మక ద్రోహం చేస్తున్నారని కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకొస్తామని చెప్పి... ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలో వారికి విద్యుత్ రాయితీలను కూడా తగ్గించారని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగంలో 30 శాతం పెట్టుబడుల రాయితీ ఇస్తే, ప్రస్తుతం 15 శాతానికి కుదించారన్నారు. ఇదేనా ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. దళితులకు పారిశ్రామిక పాలసీని పునః సమీక్షించాలని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-08-11T16:03:05+05:30 IST