-
-
Home » Andhra Pradesh » TDP MLA Angani Satyaprasad
-
జగన్ పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు?: అనగాని
ABN , First Publish Date - 2020-12-19T22:13:50+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘జగన్ మోసం చేయని కులమేదైనా బీసీల్లో ఉందా?

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘జగన్ మోసం చేయని కులమేదైనా బీసీల్లో ఉందా? బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. వైసీపీ నేతలు బీసీల కాళ్ల మీద పడినా సరే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటెయ్యరు. 18 నెలల్లో రేషన్ బియ్యం, ఫించన్లు ఇవ్వడం తప్ప బీసీలకు ఏం చేశారు? బీసీలకు ఖాళీ చెంచాతో అన్నం తినిపించినట్లు వైసీపీ వ్యహరిస్తోంది. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన మేలు ద్రోహమే ఎక్కువ. నామినేటెడ్ పోస్టుల్లో ఎంతమంది బీసీలకు చోటు కల్పించారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.