రఘురామకృష్ణంరాజు కామెంట్లపై అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ

ABN , First Publish Date - 2020-06-16T17:59:04+05:30 IST

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కామెంట్లపై అసెంబ్లీ లాబీల్లోని టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో చర్చ జరిగింది.

రఘురామకృష్ణంరాజు కామెంట్లపై అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ

అమరావతి: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కామెంట్లపై అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. రఘు రామకృష్ణంరాజులా ఫీలయ్యే వాళ్లు వైసీపీలో చాలా మందే ఉన్నారన్నారు. ఎంపీ రఘరామకృష్ణం రాజు ధైర్యవంతుడు కాబట్టి ముందుకొచ్చి మాట్లాడారని వ్యాఖ్యానించారు.


ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటెత్తు పోకడ పోకుండా.. కనీసం వైసీపీ ప్రజా ప్రతినిధుల మనోభావాలనైనా గుర్తించాలన్నారు. సామాజిక వర్గాల్లో వైసీపీ చిచ్చు పెడుతోందన్న రఘురామకృష్ణంరాజు కామెంట్లు వాస్తవమేనన్నారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు ప్రజల మనిషి అని.. ఆయన చెప్పినట్టు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ బెల్టేనన్నారు.రఘురామకృష్ణంరాజు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతారని రామానాయుడు కితాబిచ్చారు.

Updated Date - 2020-06-16T17:59:04+05:30 IST