ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పండగ జరుపుకునే ఉత్సాహంతో లేరు: లోకేష్

ABN , First Publish Date - 2020-05-10T15:31:59+05:30 IST

ప్రపంచమంతా మాతృ దినోత్సం జరుపుకుంటోంది..కానీ..ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పండగ జరుపుకునే ఉత్సాహంతో లేరని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పండగ జరుపుకునే ఉత్సాహంతో లేరు: లోకేష్

అమరావతి: ప్రపంచమంతా మాతృ దినోత్సం జరుపుకుంటోంది..కానీ..ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పండగ జరుపుకునే ఉత్సాహంతో లేరని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. విశాఖ దుర్ఘటనలో కళ్లముందే కనుపాపలు కనుమూస్తుంటే ..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లులు ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఉపద్రవాలు ఇకపై జరగవని ప్రతి తల్లికీ భరోసా అందిన రోజే నిజమైన మాతృదినోత్సవం జరుపుకుంటారని చెప్పారు. పిల్లలను కోల్పోయిన తల్లులు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. 

 

Updated Date - 2020-05-10T15:31:59+05:30 IST