-
-
Home » Andhra Pradesh » tdp lokesh
-
వారి రక్తం కళ్లజూస్తున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2020-10-31T23:04:15+05:30 IST
వారి రక్తం కళ్లజూస్తున్నారు: లోకేష్

అమరావతి: అన్నం పెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారని టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు. అన్నదాతల త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై దుశ్శాసనపర్వం సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇదన్నారు.