రాజమండ్రి: అత్యాచార బాధితురాలు, దళిత యుకుడిని పరామర్శించనున్న టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2020-07-22T16:54:07+05:30 IST

రాజమండ్రి: అత్యాచార బాధితురాలు, దళిత యుకుడిని పరామర్శించనున్న టీడీపీ నేతలు

రాజమండ్రి: అత్యాచార బాధితురాలు, దళిత యుకుడిని పరామర్శించనున్న టీడీపీ నేతలు

రాజమండ్రి: రాజమండ్రి  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచారానికి గురైన దళిత బాలికను, బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీతానగరం గ్రామానికి చెందిన శిరోముండనం బాధిత దళిత యువకుడు వరప్రసాద్‌ను టీడీపీ దళిత నేతల బృందం బుధవారం పరామర్శించనుంది. మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కే.యస్.జవహర్, పీతల సుజాత, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వర రావు, అయితాబత్తుల ఆనందరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్, దళిత నేతలు మోకా ఆనంద సాగర్, దాసరి ఆంజనేయులు... బాధితులను పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-07-22T16:54:07+05:30 IST