ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2020-05-09T18:16:15+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
విశాఖపట్నం: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్‌జి పాలిమర్స్ బాధితులను టీడీపీ నేతలు శనివారం ఉదయం పరామర్శించారు. నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెనాయుడు, అయ్యన్నపాత్రుడు, అనిత, రామానాయుడు, ఎమ్మెల్సీ రామారావు, పలువురు టీడీపీ నేతలు.. బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు వెలువడంతో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.