గవర్నర్ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ
ABN , First Publish Date - 2020-04-05T14:50:54+05:30 IST
గవర్నర్ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ

అమరావతి: గవర్నర్ హరిచందన్‌కు టీడీపీ నేతలు లేఖ రాశారు. ప్రభుత్వం అందించే రూ.1000, నిత్యావసరాలను వైసీపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పంచాల్సిన సాయాన్ని వైసీపీ నేతలు పంచుతున్నారని లేఖలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. భౌతిక దూరం పాటించకుండా కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.