జగన్‌ పబ్లిసిటీ పిచ్చి రోత పుట్టిస్తోంది:టీడీపీ

ABN , First Publish Date - 2020-04-05T09:03:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వం, పాలకుల తీరుపై తెలుగుదేశం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘జగన్‌కి పబ్లిసిటీ పిచ్చ పబ్లిసిటీకే రోతపుట్టేలా ఉంటుంది. చిన్న పిల్లల ముడ్డికి తప్ప... అన్నింటికీ వైసీపీ రంగులు వేయించిన జగన్‌,

జగన్‌ పబ్లిసిటీ పిచ్చి రోత పుట్టిస్తోంది:టీడీపీ

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం, పాలకుల తీరుపై తెలుగుదేశం నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘జగన్‌కి పబ్లిసిటీ పిచ్చ పబ్లిసిటీకే రోతపుట్టేలా ఉంటుంది. చిన్న పిల్లల ముడ్డికి తప్ప... అన్నింటికీ వైసీపీ రంగులు వేయించిన జగన్‌, విజయసాయిరెడ్డి.. చంద్రబాబు పబ్లిసిటీ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది’’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు.  భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సంక్లిష్ట కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-05T09:03:39+05:30 IST