టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-07-08T19:03:43+05:30 IST

మాజీ మంత్రి బండారు అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టీడీపీ చేసిన నేరమా..?, ఇళ్లు కట్టి 13 నెలలైనా

టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: మాజీ మంత్రి బండారు అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వమనడమే టీడీపీ చేసిన నేరమా..?, ఇళ్లు కట్టి 13 నెలలైనా పేదలకు ఇవ్వకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా..?, కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూడటానికి టీడీపీ నేతలు వెళ్లడం నేరమా..?, మాజీ మంత్రి బండారుని పోలీస్ స్టేషన్‌లో అక్రమ నిర్బంధిస్తారా?, రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు అందజేయాలి. హౌసింగ్‌లో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-08T19:03:43+05:30 IST