గ్రామ సచివాలయ అభ్యర్థులకు మద్దతు తెలిపిన టీడీపీ నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-01T17:10:04+05:30 IST
విజయవాడ: గ్రామ సచివాలయ అభ్యర్థులకు మద్దతు తెలిపిన టీడీపీ తెలుగు యువత రాష్ట్ర నాయకులు, నాదెండ్ల బ్రహ్మం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామారావు అరెస్ట్ అయ్యారు.

విజయవాడ: గ్రామ సచివాలయ అభ్యర్థులకు మద్దతు తెలిపిన టీడీపీ తెలుగు యువత రాష్ట్ర నాయకులు, నాదెండ్ల బ్రహ్మం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట రామారావు అరెస్ట్ అయ్యారు. గ్రామ సచివాలయ మొదటి నోటిఫికేషన్‌లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. 13జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులేమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 3న తేదీన జరిగే కేబినెట్‌లో వారికి అనుకూలంగా న్యాయం చేయాలనీ లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గ్రామ సచివాలయ అభ్యర్థులు ప్రభుత్వాన్ని హెచ్చారించారు.