టీడీపీ నేతలను హతమార్చేలా వ్యవహరిస్తున్నారు: నిమ్మల

ABN , First Publish Date - 2020-06-26T01:11:05+05:30 IST

టీడీపీ నేతలను హతమార్చేలా వ్యవహరిస్తున్నారు: నిమ్మల

టీడీపీ నేతలను హతమార్చేలా వ్యవహరిస్తున్నారు: నిమ్మల

పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ సర్కారు అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేయడమే దుర్మార్గమైతే.. చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేయడం మరింత దుర్మార్గమని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. టీడీపీ నేతలను కేసులతో వేధించారని, అరెస్ట్‌లతో బెదిరించారని, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా వ్యవహరిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-26T01:11:05+05:30 IST