రథాల ధ్వంసం టీడీపీ పనే : బాలినేని
ABN , First Publish Date - 2020-09-18T08:50:40+05:30 IST
రాష్ట్రంలో ఆలయాల్లో రథాలను టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఆ నెపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ

ఒంగోలు, సెప్టెంబరు 17: రాష్ట్రంలో ఆలయాల్లో రథాలను టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఆ నెపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒంగోలులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై నిష్పక్షపాత విచారణ చేపట్టేందుకే ముఖ్యమంత్రి సీబీఐ విచారణను కోరారని స్పష్టంచేశారు. కాగా.. ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు బాబు కొన్ని శక్తులతో కుట్రపన్ని రథాలను ధ్వంసం చేయిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల్ విమర్శించారు.