త్వరలో జగన్‌ కూడా బంకర్లు కట్టించుకునే పరిస్థితి వస్తుంది: యరపతినేని

ABN , First Publish Date - 2020-06-04T18:18:09+05:30 IST

త్వరలో జగన్‌ కూడా బంకర్లు కట్టించుకునే పరిస్థితి వస్తుంది: యరపతినేని

త్వరలో జగన్‌ కూడా బంకర్లు కట్టించుకునే పరిస్థితి వస్తుంది: యరపతినేని

అమరావతి: ప్రజావ్యతిరేక విధానాలతో జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్‌ విమర్శించారు. నేరచరిత్ర స్వభావం ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ ఏడాది పాలనే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడితే ట్రంప్ వెళ్లి బంకర్లో దాక్కున్నారని... జగన్ కూడా బంకర్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో వస్తుందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను న్యాయస్థానాలు తప్పుబడుతుంటే చులకనవుతున్న తీరును పక్కదోవ పట్టించేందుకే వైకాపా నేతలు  తెలుగుదేశాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. 


ప్రతీదానికీ చంద్రబాబు వయస్సు మీద విమర్శలు చేస్తున్నారని..వారికి వయస్సు పెరగదని వైకాపా నేతలు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే అంబటి రాంబాబు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకులెందరో ఉన్నారని...వైకాపా నేతలు విమర్శిస్తున్నట్లుగా లోకేష్‌కి అవినీతిలో అనుభవం లేదని అన్నారు. వాళ్ల మాదిరి సూట్ కేసు కంపెనీలు పెట్టడం, దొంగ సొమ్ము దోచుకోవటం, అక్రమార్జన చేయటంలో జగన్‌లా లోకేష్‌కి అనుభవం లేదని విమర్శించారు. 


శశికలలా జైలుకెళ్తే వైకాపా కుక్కలు చింపిన విస్తరే అని దుయ్యబట్టారు. జగన్ చుట్టూ ఉన్నవారంతా అవకాశవాదులు కాదా అని ప్రశ్నించారు. ధర్మాన, బొత్స, వీళ్లంతా జగన్‌ని విమర్శించిన వారే వై.ఎస్ మరణం వెనుక కూడా జగన్ హస్తం ఉందని బొత్స విమర్శలు చేయలేదా అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద నోరు పారేస్తే ఉతికి ఆరేస్తాం ఖబడ్దార్ అని యరపతినేని హెచ్చరించారు.

Updated Date - 2020-06-04T18:18:09+05:30 IST