-
-
Home » Andhra Pradesh » tdp leader vijay kumar vishakapatnam
-
టీడీపీని లేకుండా చేయడం మీ తరం కాదు: విజయ్ కుమార్
ABN , First Publish Date - 2020-06-22T20:13:41+05:30 IST
టీడీపీని లేకుండా చేయడం మీ తరం కాదు: విజయ్ కుమార్

విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని... జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితుల ఓట్లతో గెలిచి దళితులనే టార్గెట్ చేశారని మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని...చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలు చదువుకున్న పుస్తకాలపై జగన్ ఫోటోలను ప్రచురిస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీ పాలన తీసుకువచ్చి... బీసీలను కూడా టార్గెట్ చేశారన్నారు. అయ్యన్న పాత్రుడు మీద 7 కేసులు పెట్టారని...ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని నిలదీశారు. నవరత్నాల పేరిట దళితులకు ఒక్క పథకం ఏమైనా పెట్టారా? అని ప్రశ్నించారు. ‘‘టీడీపీని లేకుండా చేయడం మీ తరం కాదు’’ అని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.