సీఎం జగన్‌కు వర్లరామయ్య బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2020-09-16T15:24:53+05:30 IST
రాష్ట్రంలో దళిత వర్గాలపై వరుస దాడులు జరుగుతుంటే మిగతా పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నా సాక్షి పత్రికలో దళిత వార్తలను నిషేదించినట్లుగా కనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

అమరావతి: రాష్ట్రంలో దళిత వర్గాలపై వరుస దాడులు జరుగుతుంటే మిగతా పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నా సాక్షి పత్రికలో దళిత వార్తలను నిషేదించినట్లుగా కనిపిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు వర్ల బహిరంగ లేఖ రాశారు. దళిత వర్గాలకు చెందిన ప్రజలు చెల్లించిన పన్నుల ఖాతా నుండి సాక్షి పత్రికకు పత్రికా ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తన్నప్పుడు తమ వార్తలు రాయకపోవడం అన్యాయం కదా అని ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక ఎందుకో దళిత వర్గాలకు చెందిన వార్తలను ప్రముఖంగా ప్రచురించటంలేదని విమర్శించారు. తమ దళితుల డబ్బుతో సాక్షి పత్రికకు కోట్లాది రూపాయలు పన్ను చెల్లిస్తున్నప్పుడు దళిత వార్తలను ప్రకటించకపోవడం తమ వర్గాలను కించపరచడం కదా అని నిలదీశారు. దళిత వార్తలు ప్రచురించకుండా దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియలో నమోదు చేసుకున్నప్పుడు పత్రికను ఎటువంటి రాగద్వేషాలు లేకండా సమాన దృష్టితో ప్రజలకు వార్తలు అందించే దృష్టితోనే నడుపుతామని యాజమాన్యం ప్రమాణం చేస్తారని లేఖలో పేర్కొన్నారు.