-
-
Home » Andhra Pradesh » tdp leader serious comments on mla shiva kumar
-
ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ మంత్రి
ABN , First Publish Date - 2020-05-18T22:04:02+05:30 IST
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు నివేశిత స్థలాల పేరుతో శివకుమార్ భారీ భూ కుంభకోణానికి

గుంటూరు: తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. పేదలకు నివేశిత స్థలాల పేరుతో శివకుమార్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రూ.150 కోట్లు దోచుకున్నారని అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. శివకుమార్ భూ దోపిడీకి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టకపోతే ప్రభుత్వానికి కూడా దోపిడీలో భాగం ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. తెనాలి ఎమ్మెల్యే భూ కుంభకోణాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని రాజా విజ్ఞప్తి చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇంత భారీ దోపిడీ ఎప్పుడూ జరగలేదన్నారు. పేదలకు బిస్కెట్లు వేసి పాలకులు బంగారు బిస్కెట్లు దండుకుంటున్నారని దుయ్యబట్టారు. 11 నెలల పాలనలో తెనాలి ఎమ్మెల్యే రూ.150 కోట్లు భూముల మీదే దోచుకున్నాడని రాజా ఆరోపించారు. శివకుమార్ దోపిడీపై ప్రభుత్వం స్పందించకుంటే.. తానే కోర్టుకు వెళ్తానని తెలిపారు.