-
-
Home » Andhra Pradesh » tdp leader payyavula kesav anantapur
-
మూడు కాదు నాలుగు వేరుశెనగ బస్తాలివ్వాలి : పయ్యావుల
ABN , First Publish Date - 2020-05-18T18:28:37+05:30 IST
మూడు కాదు నాలుగు వేరుశెనగ బస్తాలివ్వాలి : పయ్యావుల

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండ మండలం చిన్న మూస్టురులో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులందరికీ వేరుశనగ విత్తనాలు నాలుగు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు మూడు బస్తాలు ఇవ్వడం సరికాదన్నారు. అయితే కొంత మంది రైతులకు ఓటిపి రావడం లేదని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకెళ్లగా....రైతులందరికీ వేరుశెనగ విత్తన బస్తాలను అందించాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే పయ్యావుల సూచించారు.