-
-
Home » Andhra Pradesh » tdp leader nara lokesh fire on jagan government
-
ఏం నేరం చేశారని మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు?: లోకేష్
ABN , First Publish Date - 2020-06-23T16:48:08+05:30 IST
ఏం నేరం చేశారని మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు?: లోకేష్

అమరావతి: టీడీపీ సానుభూతిపరులు నందకిషోర్, కృష్ణ అరెస్ట్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘వైకాపా మాఫియా ఇసుక కొట్టేస్తే నో సిఐడి, ఇళ్ల స్థలాలు అమ్మతుంటే నో సిఐడి, ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో కోట్లు కొల్లగొడుతుంటే నో సిఐడి, విషం కంటే ప్రమాదకరమైన మందు పోస్తూ వేల కోట్లు జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే నో సిఐడి. 108లో స్కామ్ బయటపడితే నో సిఐడి, మైన్స్ మింగేస్తుంటే నో సిఐడి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే నో సిఐడి. రాజారెడ్డి రాజ్యాంగంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌ని సోషల్ మీడియా వేధింపుల డిపార్ట్మెంట్‌గా మార్చేసారు జగన్ గారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ని హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?. ఏం నేరం చేసారని అర్థరాత్రి చొరబడి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు?. కృష్ణ, కిషోర్ గారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. జగన్ గారి చెత్త పాలన గురించి వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా వివరిస్తున్నారు.. మరి వారిని కూడా సిఐడి అరెస్ట్ చేస్తుందా?’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.