కోవిడ్ దహన సంస్కారలపై ప్రభుత్వ వాగ్ధానం ఏమైంది?: లోకేష్

ABN , First Publish Date - 2020-08-22T12:47:13+05:30 IST

కోవిడ్‌ పాజిటివ్‌తో చనిపోయిన తండ్రి అంత్యక్రియల కోసం అంబులెన్స్‌ సిబ్బంది రూ.85వేలు వసూలు చేశారంటూ

కోవిడ్ దహన సంస్కారలపై ప్రభుత్వ వాగ్ధానం ఏమైంది?: లోకేష్

అమరావతి: కోవిడ్‌ పాజిటివ్‌తో చనిపోయిన తండ్రి అంత్యక్రియల కోసం అంబులెన్స్‌ సిబ్బంది రూ.85వేలు వసూలు చేశారంటూ ఆవేదనతో ఓ ఎన్‌ఆర్ఐ చెప్పిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కోవిడ్ దహన సంస్కారాల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నిస్తూ...సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘కర్నూలులో తన తండ్రిని కోల్పోయిన మెల్బోర్న్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐ... అంత్యక్రియల కోసం అంబులెన్స్ సిబ్బందికి  85 వేల రూపాయాలు చెల్లించారు. కోవిడ్ దహన సంస్కారాల కోసం ప్రభుత్వం వాగ్ధానం చేసిన రూ.15 వేల హామీ ఏమైంది. నకిలీ వాగ్ధానాలు, అబద్ధాలను వ్యాప్తి చేయడంలో మాత్రమే జగన్ ఉన్నారు అని’’ లోకేష్ విమర్శంచారు. తాను రూ.85వేలు చెల్లించానంటూ వాపోయిన బాధితుడి వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-08-22T12:47:13+05:30 IST