అచ్చెన్న ప్రాణానికి ఏమైనా హానీ జరిగితే...: లోకేష్

ABN , First Publish Date - 2020-06-25T18:16:42+05:30 IST

అచ్చెన్న ప్రాణానికి ఏమైనా హానీ జరిగితే...: లోకేష్

అచ్చెన్న ప్రాణానికి ఏమైనా హానీ జరిగితే...: లోకేష్

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేందుకు యత్నించడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రెండోసారి ఆపరేషన్ జరిగి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పాక కూడా అచ్చెన్నాయుడుగారిని అర్థరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేసి, అదుపులోకి తీసుకోవాలనే కుట్ర చూస్తుంటే... ప్రభుత్వం ఆయన ప్రాణాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానంగా ఉంది. బీసీ నేత అచ్చెన్నాయుడు పై ఇన్ని కుట్రలు జరుగుతుంటే వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఏం చేస్తున్నారు? సీఎం జగన్‌కు తెలుగుదేశం పార్టీ ఒకటే చెబుతోంది. అచ్చెన్నాయుడిగారి ప్రాణాలకు ఏ మాత్రం హాని జరిగినా దానికి మీరే బాధ్యత వహించాలి. లేదంటే బీసీలు మిమ్మల్ని క్షమించరు’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. Updated Date - 2020-06-25T18:16:42+05:30 IST