‘రైతుల పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’

ABN , First Publish Date - 2020-12-17T14:58:33+05:30 IST

కంకులు కోసిన చేతులతోనే పిడికిళ్లు బిగించి అమరావతి కోసం అన్నదాతలు ఏడాది నుంచి అలుపు లేకుండా..

‘రైతుల పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’

అమరావతి: కంకులు కోసిన చేతులతోనే పిడికిళ్లు బిగించి అమరావతి కోసం అన్నదాతలు ఏడాది నుంచి అలుపు లేకుండా పోరాటం చేస్తున్నారని టీడీపీనేత దేవతోటి నాగరాజు కొనియాడారు. గురువారం ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం మహిళలు ఉక్కు సంకల్పంతో  చేస్తున్న పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ‘అమరావతి పోరాటంలో ఏడాదిగా నిర్బంధిస్తే నిగ్గదేశారు.. లాఠీ ఎత్తితే మరింత గట్టిగా గొంతెత్తి జై అమరావతి అంటూ నినదించారు.. కేసులు పెడితే న్యాయ పోరాటం చేశారు..’ తప్ప  అమరావతి సంకల్పం మాత్రం సడలలేదని నాగరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-12-17T14:58:33+05:30 IST