వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ విమర్శలు
ABN , First Publish Date - 2020-12-14T02:29:20+05:30 IST
ఏలూరు ఘటనపై వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత లోకేష్ ట్వీటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత లోకేష్ ట్వీటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఆహారం, తాగునీరు ఎంతవరకు సురక్షితమనే ఆందోళన ప్రజల్లో ఉందని అన్నారు. ఏలూరు ఘటన రాష్ట్రంలో సురక్షిత ఆహారం, మంచినీటిని ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. ఏలూరు లాంటి ఘటన పునరావృతం కాకుండా.. ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ట్విట్టర్‌లో నారా లోకేష్ ఆరోపించారు. సీఎం జగన్ అసమర్ధతత వల్లే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు.