కొల్లు అరెస్టుతో ఆ విషయం మరోసారి స్పష్టమైంది: కేఈ కృష్ణమూర్తి
ABN , First Publish Date - 2020-07-04T14:48:10+05:30 IST
కొల్లు అరెస్టుతో ఆ విషయం మరోసారి స్పష్టమైంది: కేఈ కృష్ణమూర్తి
అమరావతి: కొల్లు రవీంద్ర అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అసమర్థ పాలనను ప్రశ్నించే ప్రతిఒక్కరిని అక్రమ అరెస్ట్‌లతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం తన అధికారాన్ని కేవలం కక్ష సాధింపుల కోసం వినియోగించుకోవడం దుర్మార్గమన్నారు. రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేని వ్యక్తి కొల్లు రవీంద్ర అని తెలిపారు. నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకు వెళతారని కొల్లు అరెస్టుతో మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల నేతలపై కక్ష సాధింపు చర్యలను విడనాడాలని కేఈ కృష్ణమూర్తి హితవు పలికారు.