ఏపీలో భూఅక్రమాలపై లెక్కలు చూపేందుకు సిద్ధం: కళా వెంకట్రావు
ABN , First Publish Date - 2020-09-03T15:25:26+05:30 IST
వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని...మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు.

అమరావతి: వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని... మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కళా వెంకట్రావు లేఖ రాశారు. భూస్థలాల వేటలో వైసీపీ నేతలు రియల్ బ్రోకర్ల అవతారం ఎత్తి... రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతిపై వైసీపీ నేతలే కోర్టులలో కేసులు వేస్తున్నారని తెలిపారు. బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోయింది బడుగు, బలహీనవర్గాల ప్రజలే అని అన్నారు. 15 నెలల పాలనలో ఒక్క ఇంటినీ నిర్మించలేకపోయారని వ్యాఖ్యానించారు. భూఅక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పడానికి సిద్ధమని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు.