ఇసుకలో ఎమ్మెల్యేకు రోజూ రూ.10 లక్షల వాటా: జీవీ ఆంజనేయులు
ABN , First Publish Date - 2020-09-04T03:08:06+05:30 IST
బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు గుండ్లకమ్మ వాగును గుల్ల చేస్తున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఇసుక పేరుతో..

గుంటూరు: బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు గుండ్లకమ్మ వాగును గుల్ల చేస్తున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఇసుక పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తుం చేశారు. ఇసుకలో ఎమ్మెల్యేకు రోజూ రూ.10 లక్షల వాటా వస్తుందని ఆరోపించారు. రూ.4 లక్షలు కూడా చేయని బొల్లా భూమిని రూ.18లక్షలకు ఇచ్చారన్నారు. బొల్లాకు బుద్ది చెప్పేందుకు వినుకొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు చెప్పారు.