ఎస్‌ఈసీని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు: రామకృష్ణ ప్రసాద్
ABN , First Publish Date - 2020-06-23T14:09:25+05:30 IST
ఎస్‌ఈసీని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు: రామకృష్ణ ప్రసాద్
అమరావతి: ఎస్‌ఈసీని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం..కోర్టులను గౌరవించడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పులను కూడా జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వ్యవస్థలను కాపాడాలన్న నిమ్మగడ్డ పోరాటానికి అందరం మద్దతు ఇవ్వాలని రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.