మంత్రి బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: వీరాంజనేయులు
ABN , First Publish Date - 2020-07-17T17:39:24+05:30 IST
మంత్రి బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: వీరాంజనేయులు
ఏలూరు: మంత్రి బాలినేని అక్రమంగా ఆరుకోట్లు తరలిస్తూ పట్టుబడడం తమిళనాడు మీడియా ప్రసారం చేసిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తెలిపారు. అవినీతికి పాల్పడనంటూ చెప్పుకొస్తున్న సీయం జగన్ ఈ చర్యను ఏ విధంగా సమర్ధిస్తారని ప్రశ్నించారు. మంత్రి బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డబ్బు నాది అని చెబుతున్న వ్యక్తి కూడా వైసీపీ నాయకుడే అని అన్నారు. దళిత న్యాయమూర్తి రామకృష్ణపై దాడి చేయడం నీచం, హేయమని మండిపడ్డారు. ఆ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. దళిత వ్యతిరేక కార్యక్రమాలను జగన్ చేస్తుండడంతో, దళితులంతా బాధపడుతున్నారని వీరాంజనేయులు తెలిపారు.