ఈ ద్వంద్వ నీతి, కుటిల నీతికి ఏం పేరు పెట్టాలో?: నాగరాజు
ABN , First Publish Date - 2020-09-03T16:56:56+05:30 IST
ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజీకి రాలేదని దళితుల ఇంటికి నిప్పంటించారు., ప్రేమించాడని ఊరి నుంచి తరిమేశారు., దాడుల నుంచి దమ్మీల దాకా ఎదిగిన జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల ఉనికి ప్రశ్నార్థకమయ్యింది., అణచివేత ఎంత ఎక్కువగా ఉంటే.. తిరుగుబాటు అంతకు రెట్టింపుగా ఉంటుంది., ప్రతి ఒక్క దళిత స్త్రీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా మారాలి..?! దళితుల ఆరాధ్యదైవం అంబేద్కర్ కు పాలాభిషేకం చేస్తునే., దళితుల బతుకుల్లో విషం చిమ్ముతున్నారు., ఈ ద్వంద్వ నీతికి, కుటిలనీతికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు’’ అంటూ నాగరాజు వ్యాఖ్యానించారు.